Mithra Mandali Movie Teaser Out Now: నటుడు ప్రియదర్శి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వరుస హిట్స్ దూసుకుపోతున్నాడు. ఇటీవల సారంగపాణి జాతకం మూవీతో వచ్చిన ప్రియదర్శి ఈసారి మిత్ర మండలి మూవీతో వస్తున్నాడు. బన్నీవాస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. తనదైన కామెడీ పంచ్‌లతో అలరించే ప్రియదర్శి.. మిత్ర మండలిలోనూ తనదైన మార్క్‌ను చూపించాడు.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యాంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంటోంది. ‘ఎండ మండింగ్.. చెమట పుట్టింగ్..’ అంటూ క్రికెట్ కామెంటరీ లెవల్‌లో టీజర్ ప్రారంభమైంది. కాగా.. బాల్ లేకుండా క్రికెట్ ఆడడం.. కామెంటరీ చెబుతూనే క్యారెక్టర్స్‌ను పరిచయం చేయడం ఆసక్తి పెంచేసింది. ‘బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు. రోజూ ఎవరో ఒకరిని వెర్రి వారిని చేస్తారు’ అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ సినిమాతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ నిహారిక ఎంట్రీ ఇస్తోంది.
వెన్నెల కిశోర్, సత్య, వీటీవీ గనేష్, ప్రసాద్ బెహరలలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ సినిమాతో ఎస్.విజయేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్.ఆర్.ధృవన్ సంగీత అందిస్తున్నారు. ‘బన్నీ వాస్ వర్క్స్’ పతాకంపై బన్నీ వాస్ సమర్పిస్తుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల మూవీని నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.