Site icon Prime9

Pradeep Ranganathan: కథ నచ్చడంతోనే డైరెక్టర్‌కి కారు గిఫ్ట్‌ ఇచ్చిన ‘లవ్‌టుడే’ హీరో ప్రదీప్‌

Pradeep Ranganathan Gifts car to Director: తమిళ నటుడు, డైరెక్టర్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ లవ్‌ టుడే తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఈచిత్రంలో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. తమిళ్‌, తెలుగులో వచ్చిన లవ్‌ టుడే మూవీ రెండు భాషల్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇప్పుడ ప్రదీప్‌ మరో రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘రిటర్న్‌ ఆప్‌ ది డ్రాగన్‌’తో తెలుగు ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించి ఈ సినిమాకు అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించారు.

యూత్‌ ఎంటర్‌టైనర్‌గా తమిళ్‌, తెలుగు బాషల్లో ఈ చిత్రాన్ని తెరక్కించారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్‌ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ప్రస్తుతం తమ ప్రొడక్షన్‌లో ప్రదీప్‌తో ఓ సినిమా చేస్తున్నామని, ఇప్పటికే 20 రోజులు షూటింగ్‌ కూడా చేశామన్నారు.

“నిజానికి లవ్‌ టుడే చిత్రాన్ని హిందీ రీమేక్‌ చేయాలని అనుకున్నాం. కానీ అది కుదరలేదు. లక్కీగా ఆయనతో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. అతడితో పని చేయడం గర్వంగా, ఆనందంగా ఉంది” అన్నారు. అదే విధంగా ప్రదీప్‌ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘సాధారణంగా ఏ హీరో అయినా, నిర్మాత అయినా మూవీ బ్లాక్‌బస్టర్‌ అయితే దర్శకులకు గిఫ్ట్‌ ఇస్తారు. కానీ ప్రదీప్‌ మాత్రం కథ నచ్చడంతోనే దర్శకుడిగా కారు గిఫ్టుగా ఇచ్చారు. ఇండస్ట్రీలో మొదటి సారి ఇలా జరగడం. తనకు కథ చెప్పడానికి డైరెక్టర్‌ రోజూ బైక్‌ వస్తున్నాడు అని తెలిసి అతడికి కారు గిఫ్టుగా ఇచ్చాడు’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version
Skip to toolbar