Prabhas Salaar Re Release Advance Booking: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం సలార్ రీ రిలీజ్ అవుతోంది. మార్చిలో ఈ సినిమా మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఆ తర్వాత అదే రేంజ్‌లో సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, చెప్పుకోదగ్గ హిట్ లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా భారీ బడ్జెట్ సినిమాలు చేసిన అవి ఆశించిన విజయం సాధించలేదు. బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టినప్పటికి హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయాయి.
లాంగ్ గ్యాప్ తర్వాత డార్లింగ్ కి హిట్
లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ ఓ భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చి మంచి కంబ్యాక్‌ని ఇచ్చిన చిత్రం ‘సలార్’. ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్క్ థీమ్‌లో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య 2023 డిసెంబర్ 22న విడుదలైంది. కేజీయఫ్ తరహాలోనే వెయ్యి కోట్లపైనే వసూళ్లు సాధిస్తుందని అంతా ఆశపడ్డారు. కానీ, ఆ రేంజ్ సలార్ క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వసూళ్ల దగ్గర ఆగిపోయింది. థియేటర్లలో కంటే ఓటీటీ సలార్ మూవీ విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. స్ట్రీమింగ్ వచ్చిన గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.
సలార్ రీ-రిలీజ్
ఇక సలార్ మూవీ ఉన్న క్రేజ్ దృష్ట్యా, సోషల్ మీడియా వస్తున్న డిమాండ్స్ మేరకు ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. మార్చి 21న ఈ సినిమా థియేటర్లోకి మళ్లీ తీసుకువస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటన కూడా ఇచ్చారు. ఇక మూవీ రీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. నిన్న సుదర్శన్ థియేటర్ బుక్‌మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ చేయగా క్షణాల్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రెండో రోజు కూడా అదే జోరు కనిపించింది. అడ్వాన్స్ బుక్కింగ్‌లో అప్పుడే టికెట్స్ అన్ని సేల్ అవ్వడం హౌజ్‌ఫుల్ బోర్డు పెట్టేశారు. మూవీ విడుదలై ఏడాది మాత్రమే అయ్యింది. ఇప్పటికీ సలార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
అప్పుడు హౌజ్‌ఫుల్
అడ్వాన్స్ బుకింగ్స్‌లో మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రీ-రిలీజ్‌లోనూ సలార్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. సోషల్ మీడియాలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలోని క్లిప్స్ షేర్ చేస్తూ నెట్టింట సలార్ జాతర జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా ప్రశాంత్ దర్శకత్వంలో ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘సలార్ 1: సీజ్ ఫైర్’ టైటిల్‌తో ఫస్ట్‌ఫార్ట్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం పార్ట్ షూటింగ్ జరుపుకుంటోది. ‘సలార్ 2: శౌర్యంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్‌ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించగా.. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.