Dimple Hayathi : టాలీవుడ్ నటి డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఊహించని ఈ ఘటనతో డింపుల్ హయతి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం..
డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో కలిసి జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్స్ లో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా చేస్తున్న ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కూడా నివసిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పార్కింగ్ స్థలంలో వీరి కార్లు పెట్టుకునేచోట రాహుల్ డ్రైవర్ తో డింపుల్ కి వాగ్వాదానికి దిగుతుందని తెలుస్తుంది. తరుచుగా వీరి మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదం రీసెంట్ గా తీవ్ర స్థాయికి చేరింది. రాహుల్ డ్రైవర్ చెప్పినా కూడా వినకపోగా అతన్ని తిట్టి, ఆ కారుని కాలితో తన్ని, కారుకి అడ్డంగా ఆన్న మెష్ ని తొలగించి రచ్చ చేసింది డింపుల్. అలానే ఆ ఐపీఎస్ అధికారి కారుని తన కారుతో ఢీ కొట్టడంతో మరోసారి గొడవ మరింత ముదిరింది. దాంతో డింపుల్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు డింపుల్, డేవిడ్ పై 353, 341, 279 సెక్షన్ ల కింద, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదు చేసుకొని డింపుల్ ని, ఆమె ఫ్రెండ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఇద్దర్ని ఈ విషయంలో హెచ్చరించి CRPC 41a కింద నోటీసులు ఇచ్చి, మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు. దీంతో ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ విషయం పై హయతి ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించింది. అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు అంటూ ట్వీట్ చేసింది. దాంతో పాటు ఓ స్మైలీ ఎమోజీని కూడా షేర్ చేసింది.
Using power doesn’t stop any mistake . 😂
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023
డింపుల్ హయతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి (Dimple Hayathi). ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే గోపీచంద్ తో కలిసి రామబాణం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోవడంతో ఈ అమ్మడికి మళ్ళీ నిరాశ తప్పలేదు.