Site icon Prime9

Nayanatara – Vignesh Shivan : ఫస్ట్ యానివర్సరీ ని జరుపుకుంటున్న నయనతార – విఘ్నేష్ శివన్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ !

Nayanatara - Vignesh Shivan first marriage anniversary posts goes viral

Nayanatara - Vignesh Shivan first marriage anniversary posts goes viral

Nayanatara – Vignesh Shivan : నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. ఇక కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ భామ… కోలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. తనదైన శైలిలో రాణిస్తూ లేడి సూపర్ స్టార్ హోదాని సంపాదించుకుంది.

తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ – నయన్ కొన్నాళ్ళు ప్రేమించుకొని అనంతరం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. కాగా నయన్ – విగ్నేశ్ 2022 జూన్ 9న వివాహం చేసుకోగా.. నేటికి వారి వివాహం జరిగి ఏడాది పూర్తి అవుతుంది. దీంతో వారికి అభిమానులు, నెటిజన్లు వారికి సోషల్ మీడియా వేదికగా మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విగ్నేశ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.  ఈ మేరకు విగ్నేశ్ కూడా (Nayanatara – Vignesh Shivan) వివాహ వార్షికోత్సవం రోజును పురస్కరించుకొని రెండు ఆసక్తికర పోస్ట్ లు చేశారు. వాటిలో ముందుగా నయన్ తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. “నిన్నే నాకు వివాహం అయినట్టు ఉంది. సడెన్ గా అందరూ నాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లవ్ యు తంగమై. మన జర్నీని ప్రేమ, ఆశీర్వాదాలతో మొదలుపెట్టాం. మనం ఇంకా చాలా దూరం వెళ్లి కలిసి సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మా జీవితంలో ఉన్న అందరి మంచి వ్యక్తులు, దేవుని ఆశీర్వాదాలతో మేము రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అని రాసుకొచ్చాడు.

అదే విధంగా మరో పోస్ట్ లో నయనతారతో పాటు తన కవల పిల్లలు ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ.. అప్పుడే సంవత్సరం అయింది. సంవత్సరంలో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి, కష్ట సుఖాలు ఉన్నాయి. కానీ ఇంటికి వస్తే ప్రేమగా చూసే ఫ్యామిలీ ఉంది. నాకు ఎంతో స్పెషల్ అయిన ఉయర్, ఉలగంలు మా జీవితాన్ని మరింత అందంగా మార్చారు. వారు నాకు ఎనర్జీ ఇస్తూ నా డ్రీమ్స్ వైపు మరింత పరిగెత్తేలా చేస్తున్నారు అంటూ మరో ఎమోషనల్ పోస్ట్ చేశాడు విగ్నేశ్. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Exit mobile version