Site icon Prime9

Nari Nari Naduma Murari: మొదటి సాంగ్ రిలీజ్.. వెంటనే డిలీట్.. అసలేమైంది

nari nari naduma murari

nari nari naduma murari

Nari Nari Naduma Murari:  కుర్ర హీరో శర్వానంద్ గతేడాది మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు శర్వానంద్  నారీ నారీ నడుమ మురారీ అంటూ రాబోతున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారీ నారీ నడుమ మురారీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ , ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో  శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు.

 

ఇప్పటికే నారీ నారీ నడుమ మురారీ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. దర్శనమే.. మధుర క్షణమే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  మ్యూజిక్ డైరెక్టర్  విశాల్ చంద్రశేఖర్ ఖాతాలో మరో మెలోడీ యాడ్ అయ్యిందని చెప్పొచ్చు.

 

రామజోగయ్య శాస్త్రి  లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను యాజిన్ నిజార్ అద్భుతంగా ఆలపించాడు. శర్వా, సంయుక్త మధ్య ప్రేమ కథను ఎంతో అద్భుతంగా చూపించారు. శర్వానంద్ లుక్ చాలా కొత్తగా ఉంది.  హీరోయిన్ ను చుసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయి.. ఆమెతో పరిచయం పెంచుకుంటూ.. ఆమెను ప్రేమలో పడేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. 

 

ముఖ్యంగా వీడియోలో శర్వా.. ఖుషీలోని పవన్ ఐకానిక్ సీన్ ను రీక్రియెట్ చేశాడు. ఖుషీ అనగానే నడుము సీన్ గుర్తొస్తుంది కదా. అది కాకుండా పవన్ కళ్యాణ్, భూమిక ఫుడ్ తింటూ ఉంటే.. పవన్ స్పూన్ కిందపడేసి.. భూమిక స్పూన్ తీసుకొని తింటాడు. అది చూసి భూమిక సిగ్గుపడుతుంది. ఆ సీన్ ను శర్వా, సంయుక్త  రీక్రియేట్ చేశారు. టోటల్ గా ఈ సాంగ్ అద్భుతంగా అనిపిస్తుంది. మొదటి సాంగ్ తోనే శర్వా సినిమాపై అంచనాలను పెంచేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సాంగ్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికే మేకర్స్ ఈ సాంగ్ యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారో అనేది  తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar