Site icon Prime9

Kubera Movie: నాగార్జున, ధనుష్‌ల కుబేర రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Kuber Movie Release Date Fix: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో క్లాసిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. స్టార్‌ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ధనుష్‌ లుక్‌ ఆసక్తిని పెంచుతుంది. అదే విధంగా మూవీ పోస్టర్స్‌, టీజర్‌, స్పెషల్‌ వీడియోలు మూవీ హైప్‌ పెంచాయి.

దీంతో కుబేర రిలీజ్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సంక్రాంతికి కుబేర థియేటర్లలోకి వస్తుందని మూవీ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూశారు. అయితే అది జరగలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్‌ ఎప్పుడనేది సస్పెన్స్‌ నెలకొంది. ఈ క్రమంలో ఈ సస్పెన్స్‌కి తెరలేపుతూ తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. ఈ సినిమాను జూన్‌ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ మూవీ మరిన్ని అంచనాలు పెంచేస్తోంది.

ధనుష్‌, నాగార్జున ఎదురెదురుగా నిలబడి ఒకరి మొహంలో కి ఒకరు చూసుకుంటుండగా.. మధ్య బాలీవుడ్‌ నటుడు జిమ్‌ షర్బ్‌ నిలుచుని ఉన్నాడు. ఇందులో నాగార్జున క్లాస్‌గా కనిపించగా.. ధనుష్‌ మాసిన బట్టలు, చెదిరిన క్రాఫ్‌తో కనిపించాడు. ప్రస్తుతం పోస్టర్‌ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక కుబేర రిలీజ్‌ డేట్‌ రావడంతో అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar