Site icon Prime9

Thandel Movie: ‘తండేల్‌’ జోరు మామూలుగా లేదు – బుక్‌ మై షోలో ట్రెండింగ్‌లో నిలిచిన చిత్రం!

Thandel Movie

Thandel Movie

Thandel Movie Trending in Bookmyshow: నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్‌గా నటిస్తుస్తున్న చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమా ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు, టీజర్‌, ట్రైలర్‌లతో మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాటతో తండేల్‌ మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన అప్‌డేట్స్, పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది.

మూవీ రిలీజ్ టైం దగ్గపడుతుండటంతో మేకర్స్‌ ఇస్తున్న అప్‌డేట్‌ తండేల్‌పై అంచనాలు మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీపై ఉన్న హైప్‌ అంత ఇంత కాదు. దీనికి బుక్‌మై షోలో ఈ సినిమా వస్తున్న రెస్సాన్సే ఉదాహరణ. సినిమా రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులే ఉంది. ఈ క్రమంలో బుక్‌ మై షోలో తండేల్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. తండేల్‌ 150k పైగా ఇంట్రెస్ట్స్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. యాప్‌లో అడ్వాన్స్ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అవ్వగా టికెట్స్‌ భారీగా అమ్ముడుతుపోతున్నాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ షేర్ చేసింది.

“తండేల్‌ జోరు, హైప్‌ ఆకాశాన్ని తాకుతుంది. బుక్‌మై షో మూవీ 150k పైగా ఇంట్రెస్ట్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది” అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కొబోతుందని, థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి అంటూ గీత ఆర్ట్స్‌ బ్యానర్‌ తన పోస్టులో రాసుకొచ్చింది. ఇక తండేల్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈసారి ఈ అక్కినేని హీరో ఖాతాలో భారీ హిట్‌ పడేలా కనిపిస్తుంది. ఇక ఇదే చై తొలి తెలుగు పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం.

Exit mobile version
Skip to toolbar