Thandel Movie Ticket Rates Hike: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఫిబ్రవరి 7న విడుదల కాబోతోన్న ఈ సినిమా టికెట్ ధరల పెంపుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ. 50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.75 అదనంగా వసూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
కార్తికేయ 2 ఫేం చందు మొండేలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీవాసు తండేల్‌ను నిర్మించారు. శ్రీకాకుళంలో జరిగిన నిజజీవిత సంఘటన ఆధారం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని రూపొందించారు. రాజు అనే జాలరితో పాటు పలువురు చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్థాన్ జలల్లోకి ప్రవేశిస్తారు. దీంతో వారి పాక్ నేవి బంధించి పాకిస్థాన్‌కి తీసుకువెళతారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు రాజు ప్రేయసి ఏం చేసిందనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటి మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మరి ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందకు రాబోతోన్న తండేల్ మూవీ ఎంత మేరక మెప్పిస్తుందనేది ఆసక్తిగా మారింది.