Site icon Prime9

Naga Chaitanya-Sobhita: పెళ్లి తర్వాత ఫస్ట్ వెకేషన్‌ – నెదర్లాండ్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న చై, శోభిత, ఫోటోలు వైరల్‌

Naga Chaitanya and Sobhita Vacation Photos: అక్కినేని కోడలు శోభిత క్యూట్‌ ఫోటో షేర్‌ చేసింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత తొలి వెకేషన్‌కి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట నెదార్లాండ్‌లో సందడి చేస్తోంది. నాగ చైతన్య నటించిన తండేల్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. పెళ్లి టైంలో ఈ మూవీ షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. దీంతో పెళ్లయిన వెంటనే తండేట్‌ షూటింగ్‌ సెట్లో వాలిపోయాడు. ఇక మూవీ రిలీజై మంచి విజయం సాధించింది. దీంతో చైకి ఇప్పుడు బ్రేక్‌ దొరికింది.

పైగా తండేల్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో నాగ చైతన్య, శోభితలు వెకేషన్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్‌లోని ఆమస్టర్‌డ్యామ్‌లో ఈ కొత్త జంట వాలిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ వీధుల్లో సందడి చేస్తోన్న ఫోటోలను తాజాగా శోభిత తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేసింది. అక్కడ జరుగుతున్న రెజ్లింగ్‌ షోకి హాజరైంది ఈ జంట. అలాగే ఆక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతూ స్ట్రీట్‌ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.

అక్కడ ఓ రెస్టారెంట్‌ చై-శోభితలు పక్కపక్కనే కూర్చోని బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తూ కనిపించారు. ఇందులో శోభిత నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం వారి వెకేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఇందులో వీరిద్దరి చూసి మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని, క్యూట్‌ కపుల్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఫోటోలో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుట్‌ ఆనియన్‌ సమోసాలు ఉన్న ఫోటోని కూడా షేర్‌ చేసింది. ఆమె పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా రెండేళ్ల పాటు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న ఈ జంట గతేడాది డిసెంబర్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Exit mobile version
Skip to toolbar