Producer Anandarao : సినీ పరిశ్రమలో వరుస మరణాలు చుటూ చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, కె విశ్వనాథ్, జమున, తారకరత్న.. ఇలా ఒకరి తరువాత ఒకరు వయస్సుతో సంబంధం లేకుండా పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడి టాలీవుడ్ ని శోకసంద్రంలో విడిచి వెళ్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాద వార్త చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఆనందరావు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈయన నిర్మించిన సినిమా నంది అవార్డును సైతం గెలుచుకుంది.
2012 లో ప్రముఖ నవల ‘మిథునం’ ఆధారంగా తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిథునం. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆనందరావు నిర్మించారు. ఆనందరావుకి సాహిత్యం, పర్యావరణం అంటే ఎంతో ప్రేమ. స్వతహాగా కవిత్వాలు, పద్యాలు కూడా రాసేవాడు. అంతేకాదు వాటిని కోటిగాడు పేరుతో ప్రచురించి బయటికి కూడా రిలీజ్ చేశారని తెలుస్తుంది. కాగా చాలా కాలంగా ఆనందరావు డయాబెటిక్ వ్యాధితో బడుతున్నారు.
విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన ఈరోజు కన్నుమూశారు అని ఆయన బంధువులు వెల్లడించారు. నిర్మాతగా, కవిగా, సమాజ సేవకుడిగా ఎన్నో సేవలు అందించిన ఆనందరావు మరణానికి చింతిస్తూ పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆనందరావు స్వగ్రామం వావిలవలసలో ఆయన అంత్యక్రియలు జరగాయి.