Manchu Lakshmi Gets Emotional Video Goes Viral: మంచు ఫ్యామిలీ వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ మధ్య కాస్తా సైలెంట్ అయిన మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు. తను లేని సమయంలో విష్ణు తన అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశాడని, ఇంట్లోని వస్తువులు, కార్లు దొంగలించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులను ఆశ్రయించని మరుసటి రోజే జల్‌పల్లిలోని మంచు టౌన్ వద్ద నిరసన చేపట్టాడు. తనని లోపలికి రానివ్వడం లేదని, తన పెట్స్, పిల్లలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పాడు.
మళ్లీ రాజుకున్న మంచు వివాదం
దీంతో సద్దుమణిగాయకున్న మంచు గొడవలు మళ్లీ రాజుకున్నాయి. అయితే ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. ఇక కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి కూడా మౌనంగా ఉంటోంది. ఫ్యామిలీకి దూరంగా ఆమె ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న కనీసం పెదవి విప్పడం లేదు మంచు లక్ష్మి. తనకు ఏం తెలియదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ఫ్యామిలీలో ఇంత రచ్చ జరుగుతున్న.. ఏం జరగనట్టు తనపని తాను చేసుకుంటుంది. అయితే తాజాగా మంచు లక్ష్మి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండరైజర్ కార్యక్రమం నిర్వహించింది.
అక్కను సర్‌ప్రైజ్ చేసిన మనోజ్‌దంపతులు
ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేసింది. ఆమె స్టేజ్‌పై ఉండగా.. మనోజ్ అతడి భార్య మౌనిక రెడ్డిలు వెనక నుంచి వెళ్లి ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. ఇక తమ్ముడిని చూడగానే మంచు లక్ష్మి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. స్టేజ్ ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి మనోజ్‌ని పట్టుకుని ఏడ్చేసింది. దీంతో మనోజ్ దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. న్యాయం మనోజ్ సైడే ఉందని, అందుకే మంచు లక్ష్మి తమ్ముడిని చూడగానే ఏడ్చేసిందంటున్నారు. కుటుంబంలో ఇలాంటి సాధారణమేనని, త్వరలోనే అంత సద్దుమణుగుతుంది, ధైర్యంగా ఉండంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.