Site icon Prime9

NTR: రిలాక్స్ బాయ్స్.. ఆ లుక్ కేవలం దానికోసమేనట

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుక్ పై గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రోలింగ్ కు గురైంది.  హెయిర్ మొత్తాన్ని నున్నగా దువ్వేసి.. నూనె పెట్టినట్లు కనిపించింది. దీంతో ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా బాబు.. ఏ సినిమా కోసం ఈ లుక్ ను తారక్ మెయింటైన్ చేస్తున్నాడు అంటూ అటు ఫ్యాన్స్.. ఇటు ట్రోలర్స్ తలలు బద్దలుకొట్టుకున్నారు.

 

అయితే ఎన్టీఆర్ న్యూ లుక్ చూసాకా ఆ అనుమానాలన్నింటికీ చెక్ పడింది. తాజాగా ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించాడు. జెప్టో యాడ్ లో ఉన్న లుక్ కాకుండా ఒరిజినల్ కర్లీ హెయిర్ తో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. నిజం చెప్పాలంటే.. ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ నే కాదు ట్రోలర్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ కొత్త లుక్ తో ఎన్టీఆర్ ట్రోలర్స్ కు సమాధానం చెప్పేశాడు.

 

జెప్టో యాడ్ కోసం మాత్రమే ఎన్టీఆర్ ఆ లుక్ ను మెయింటైన్ చేసాడని, ప్రస్తుతం ఈ న్యూ లుక్ ఎన్టీఆర్.. వార్ 2 కోసం రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. చాలా బరువు తగ్గి..  స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రిలాక్స్ బాయ్స్.. ఆ లుక్ కేవలం యాడ్ కోసమేనట అని కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాల స్టైలిష్ గా కనిపించాడు. బ్లాక్ డెనిమ్ షర్ట్, గాగుల్స్, చేతికి లక్షలు ఖరీదు చేసే వాచ్ తో నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్యాన్స్ అబ్బా.. ఏమున్నాడ్రా.. వింటేజ్ ఎన్టీఆర్ గుర్తొస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ కు బరువు పెరగడం తగ్గడం చాలా ఈజీ. కంత్రీ, యమదొంగ, నాన్నకు ప్రేమతో  లాంటి సినిమాల కోసం సన్నబడిన తారక్.. అరవింద సమేత కోసం సిక్స్ ప్యాక్ చేశాడు.

 

ఇక ఆ తరువాత జనతా గ్యారేజ్ కోసం బరువు పెరిగాడు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలకు కూడా కొద్దిగా బరువుతోనే కనిపించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం కూడా  బరువు పెరిగే ఛాన్స్ లు ఉన్నాయని సమాచారం. పాత్ర కోసం ఏదైనా చేసే హీరోగా ఎన్టీఆర్ కి ఒక పేరు ఉంది. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version
Skip to toolbar