Prime9

Mammootty: మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం

Mammootty Father In Law Passed Away: మలయాళ మెగాస్టార్‌, అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ పీఎస్‌ అబు (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు బుధవారం (జూన్‌ 11) తుదిశ్వాస విడిచారు. మమ్ముట్టి భార్య సుల్ఫత్‌ కుట్టి తండ్రే పీఎస్‌ అబు. ఆయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్‌తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో మమ్ముట్టి కుటుంబం శోకసంద్రంలో ఉంది.

 

మరో అగ్ర హీరో మోహన్‌ లాల్‌ మేనమామ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎంతో ఇష్టమైన ఆయన మరణంతో మోహన్‌ లాల్‌ ఇంట్లోని విషాదం నెలకొంది. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్‌ హీరోల ఇంట విషాదం చోటుచేసుకోవడంతో మాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా ఇండస్ట్రీలో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. తామిద్దరం సొదర సమానులం అంటూ తరచూ ఒకరిపై ఒకరు అభిమానం చూపించుకుంటుంటారు.

 

ఇటీవల మమ్ముట్టి ఆరోగ్యం కోసం మోహన్‌ లాల్‌ శబరిమలలో ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ముస్లీం అయిన మమ్ముట్టికి శబరిమలలో పూజలు చేయించడాన్ని అక్కడి హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. ఆ వివాదంపై మోహల్‌ లాల్‌ స్పందిస్తూ.. మమ్ముట్టి తనకు సోదరుడి లాంటి వారని, ఆయన కోసం నేను పూజ చేయిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మమ్ముట్టి కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మోహన్‌ లాల్‌ గౌరవాన్ని వ్యక్తం చేస్తుంటారు.

Exit mobile version
Skip to toolbar