Prime9

Shine Tom Chacko: ప్రముఖ నటుడు ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదానికి గురైన కారు..!

Malayalam Actor Shine Tom Chacko father dies in car accident: ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులతో కలిసి షైన్ టామ్ చాకో కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. షైన్ టామ్ చాకోతో పాటు అతని సోదరుడు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

వివరాల ప్రకారం.. నటుడు షైన్ టామ్ చాకో తన కుటుంబ సభ్యులతో కలిసి త్రిస్సూర్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలకొట్టై సమీపంలో సేలం, బెంగళూరు రహదారిపై కారును లారీగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నటుడి తండ్రి సీపీ చాకో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో నటుడి తల్లి కూడా ఉన్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

 

Exit mobile version
Skip to toolbar