Site icon Prime9

Mahesh Babu Returns to Hyderabad: వెకేషన్‌ నుంచి వచ్చిన మహేష్‌.. ఎయిర్‌పోర్టులో సూపర్‌స్టార్‌ సందడి!

Mahesh Babu return to Hyderabad from Italy: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇటలీ వెకేషన్‌ నుంచి తిరిగి వచ్చారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు అభిమానులతో ఫోటోలు దిగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం మహేష్‌.. దర్శక ధీరుడు రాజమౌళితో ఎస్‌ఎస్‌ఎంబీ29(#SSMB29) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్‌ షూటింగ్ కూడా జరుపుకుంది. దీంతో షూటింగ్‌కి కాస్తా బ్రేక్‌ దొరకడంతో ఇటీవల కుటుంబంతో కలిసి ఇటలీ వెకేషన్‌కి వెళ్లాడు.

 

ఫ్యామిలీతో కలిసి రోమ్ లో సందడి

ఫ్యామిలీతో కలిసి రోమ్‌లో సందడి చేసిన ఆయన ఈరోజు ఉదయం తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇటీవల ఆయన వెకేషన్‌కు వెళుతున్న ఎయిర్‌పోర్టు వీడియో వైరల్‌ అయ్యింది. అందులో మహేష్‌ మీడియాకు తన పాస్‌పోర్టు చూపిస్తూ.. చిన్న స్మైల్‌ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు జక్కన్న జపాన్‌ పర్యటనలో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ ప్రమోషన్స్‌ కోసం ఇటీవల ఆయన కుటుంబ సమేతంగా జపాన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన కూడా తిరిగి రానున్నారు. ఇక మహేష్‌ కూడా రావడంతో త్వరలోనే ఎస్‌ఎస్‌ఎంబీ20 తదుపరి షెడ్యూల్‌ మొదలు కానుంది.

 

త్వరలో ఎస్ఎస్ఎంబీ29 సెట్ కు

ఇటీవల ఒడిసాలో ఈ మూవీ చిత్రీకరన జరిగింది. అక్కడ అటవీ ప్రాంతంలో మహేష్‌, మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్‌ మధ్య కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ మూవీ లవర్స్ అంతా ఎస్‌ఎస్‌ఎంబీ29 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్‌ పూర్తి చేసుకుంటుందా, బిగ్‌స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామా? ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక అప్‌డేట్స్‌ కోసం అభిమానులంత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, జక్కన్న మాత్రం ఈ మూవీ విషయంలో చాలా గొప్యత పాటిస్తున్నారు. మూవీ సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వకుండ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

Exit mobile version
Skip to toolbar