Site icon Prime9

Sonu Sood: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ

Ludhiana Court issues arrest warrant against actor Sonu Sood: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు సోనూసూద్‌కు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, మోసం కేసులో సోనూసూద్ వాంగ్మూలం ఇచ్చేందుకు రాకపోవడంతో ముంబైలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్‌కు లుథియానా జ్యేడిషియల్ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. ఇందులో భాగంగానే, సోనూసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లుథియానాకు చెందిన లాయర్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ రూ.10 లక్షలు మూసం చేశాడని కోర్టులో వేసు వేశారు. మోహిత్ ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో మోసం చేశారని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ లాయర్ కేసు వేశారు. దీంతో కోర్టు సమన్లను పంపింది. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో మరోసారి విచారించిన సోనూసూద్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఇదిలా ఉండగా, సోనూసూద్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక, సినిమాల విషయానికొస్తే.. ‘ఫతేహ్’ పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాకుండా కరోనా సమయంలో ఆపద ఉన్న వారికి సోనూసూద్ సహాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Exit mobile version
Skip to toolbar