Site icon Prime9

Ghazal Srinivas: గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం

Lata Mangeshkar Memorial Award to Ghazal Srinivas

Lata Mangeshkar Memorial Award to Ghazal Srinivas

Pune: ప్రముఖ గిన్నీస్ వరల్ట్ రికార్డుల గాయకుడు గజల్ శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. సంగీత స్వరమాధురి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం గజల్ శ్రీనివాస్ కు లభించింది. లతా మంగేష్కర్ జన్మ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.

పూణేలోని శ్రీ యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియంలో హై హోం ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు ఆధ్వర్యంలో వేలాది మంది ప్రేక్షకుల నడుమ కార్యక్రమాన్ని చేపట్టారు. జ్నాపికతో పాటు రూ. 21 వేల పారితోషకాన్ని కూడ గజల్ శ్రీనివాస్ కు అందచేసారు. సునీల్ దేవదర్ అధ్యక్షతన సాగిన కార్యక్రమంలో లతా మంగేష్కర్ పై గజల్స్ గానం చేసి శ్రీనివాస్ ఆమెకు గాన నీరాజనం అందచేశారు. రాజేంద్ర నాధ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజల్స్ పై శ్రీనివాస్ గానానికి అభిమానుల కరాళధ్వనులతో ఆడిటోరియం మార్మోగింది.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర పోస్టర్లు చించివేత

Exit mobile version