Kiran Abbavaram Gifts Bike to Audience: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘క’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దిల్ రూబ అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటి నుంచి కిరణ్ అబ్బవరం తన మూవీ ప్రమోషన్స్‌ని కొత్త ప్లాన్ చేస్తుంటాడు. ప్రేక్షకులు ఆకర్షించేందుకు ఆఫర్స్ ఇస్తుంటాడు. గతంలో తన మూవీకి ఫ్రీ టికెట్స్ ఆఫర్ చేశాడు.
ఇప్పుడు తన సినిమా చూసే ప్రేక్షకులు కోసం ఏకంగా బైక్ గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడు. తను నటించిన ఈ దిల్ రూబ సినిమాలో అతడు వాడిన బైక్‌ని ఫ్యాన్స్‌కి బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలుపుతు వీడియో షేర్ చేశాడు. ఇందులో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మీకు కనిపిస్తుందే. ఇదే నా లవ్. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా దీన్ని కస్టమైజ్ చేశాడు. ఇది మీకు మార్కెట్లో దొరకదు. అందుకే ఈ బైక్ ని మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఇప్పటివరకు దిల్ రూబ నుంచి విడుదలైన పాటలు,టీజర్, ప్రమోషనల్ ఈవెంట్స్ మా మాటలతో కథపై హింట్ ఇచ్చేశాము. దాన్ని బట్టి మీరు మూవీ కథను గెస్ చేయండి. ఎవరైతే క్రియేటివ్ దిల్ రూబ కథను గెస్ చేస్తారో వారికి ఈ బైక్ స్వయంగా నేను ఇస్తాను. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ బైక్‌ని నేనే మీకు గిఫ్ట్‌గా ఇవ్వడంతో పాటు రిలీజ్ రోజు వాళ్లతో కలిసి బైక్‌పై థియేటర్‌కి వెళ్లిన సినిమా కూడా చూస్తాను” అని చెప్పుకొచ్చాడు. కాగా కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సార్ దిల్లాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించాడు. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.