Prime9

Kiara Advani With Baby Bump: మెట్‌గాలాలో బేబీ బంప్‌తో మెరిసిన కియారా – తొలి నటిగా గుర్తింపు

Kiara Advani Stunning With Baby Bump At Met Gala 2025: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్ చేసింది. న్యూయార్క్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఈవెంట్‌ మెట్‌గాలాలో కియారా బేబీ బంప్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా ఇదే ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్‌ సినీ తారలు కూడా సందడి చేశారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌లో జరిగిన ఈ మెట్‌గాలాలో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, సింగర్‌ దిల్జీత్‌ దోసాంజ్, ప్రియాంక చోప్రా-నిక్‌ దంపతులు, అంబానీ కూతురు ఈషా అంబానీలు పాల్గొన్నారు.

 

అలాగే అమెరికా పాప్ సింగర్‌ రిహాన్నా కూడా పాల్గొంది. ఈ వేదికలో కియారా అద్వానీ బేబీ బంప్‌తో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ భారతీయ డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా రూపొందించిన దుస్తులను కియారా ధరించి ఈవెంట్‌లో మెరిసింది. ‘సూపర్‌ఫైన్‌: టైలరింగ్‌ బ్లాక్‌ స్టైల్‌’ అనే థీమ్‌తో మెట్‌గాలా -2025 ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా రూపొందిన డైజనర్‌ ధుస్తులను రిప్రెజెంట్‌ చేస్తూ కియారా ఈ ఈవెంట్‌లో పాల్గొంది. బేబీ బంప్‌తో మెట్‌గాలా కార్పెట్‌పై ఎంట్రీ ఇచ్చిన తొలి భారతీయ నటిగా కియారా నిలవడం విశేషం.

 

దీనిపై ఆమె స్పందిస్తూ.. ఈ మెట్‌గాలా-2025 ఈవెంట్‌ తనకు చాలా ప్రత్యేకమని, కాబోయే తల్లిగా మెట్‌గాలాలో ఆరంగేట్రం చేయడం చాలా ప్రత్యకమైన అనుభూతిని కలిగిస్తోందని ఆమె పేర్కొంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కొన్నేళ్ల రిలేషన్‌ అనంతరం.. 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు కియార తల్లికాబోతున్నట్టు ఇటీవల ప్రకటించడంతో ఈజంట ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అయ్యింది. ప్రెగ్నెంట్‌ కారణంగా కియారా పలు సినిమాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. చివరిగా తెలుగులో గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో ఫ్యాన్స్‌ పలకరించింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌తో ఉన్న కియారా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది.

Exit mobile version
Skip to toolbar