Site icon Prime9

Kiara Advani: ఎట్టకేలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ – తల్లికాబోతున్నట్టు అధికారిక ప్రకటన

Kiara Advani Announced 1st Pregnancy: రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ హీరోయిన్‌, బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఎట్టకేలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు బేబీ షాక్స్‌తో క్యూట్‌ పోస్ట్‌ షేర్‌ చేర్‌ చేసింది. భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా చేతులల్లో బేబీ సాక్స్‌ చూపిస్తూ తల్లిదండ్రులు కాబోతున్నట్టు జంటగా ప్రకటన ఇచ్చారు. దీంతో సోషల్‌ మీడియాలో వేదికగా ఈ క్యూట్‌ కపుల్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

కాగా గతంలోనూ కియార ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి ప్రచారంకి మాత్రమే మిగిలిపోయాయి. ఇప్పుడు స్వయంగా కియారా నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావడంతో అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. భరత్‌ అనే నేను మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది కాయారా. తొలి చిత్రంతోనే మహేష్‌ బాబు సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో ఆమె అందం, అభినయంకు కుర్రకారు ఫిదా అయ్యింది.

తొలి చిత్రంతోనే తెలుగు మంచి స్టార్‌డమ్‌ అందుకుంది. ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో వినయ విధేయ రామ, గేమ్‌ ఛేంజర్‌లో నటించింది. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇందులో కియారా కనిపించింది తక్కువే అయిన తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా నానా హైరానాలో పాటలో కియారా తన అందంతో ఆడియన్స్‌ని మంత్రముగ్దులను చేసింది.

Exit mobile version
Skip to toolbar