Prime9

Thug Life: కమల్ వ్యాఖ్యలపై వివాదం.. కన్నడలో ‘థగ్ లైఫ్’ బ్యాన్!

Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర దూమరం లేపాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ హాసన్ బహిరంగంగా క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ మూవీని విడుదలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

 

అయితే థగ్ లైఫ్ మూవీ ఆడియో విడుదల సందర్భంగా కమల్ హాసన్.. కన్నడ భాష తమిళం నుండే పుట్టిందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు కన్నడ వాసుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, కన్నడ భాష సంఘాలు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సంస్కృతి, భాషకు అవమానం కలిగేలా కమల్ హాసన్ మాట్లాడారని మండిపడ్డారు.

 

ఈ అంశంపై కన్నడ, సంసృతిక శాఖ మంత్రి శివరాజ్ ఎస్ తంగడగి స్పందించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు కన్నడవాసులకు తీవ్ర బాధను కలిగించాయని పేర్కొంటూ.. కేఎఫ్సీసీకి లేఖ రాశారు. ఈ మేరకు కేఎఫ్సీసీ అధ్యక్షుడు నరసింహులు, ఇతర సభ్యులు, పరిశ్రమ బృందంతో సమావేశమయ్యారు. ఇవాళ్టి లోగా కమల్ హాసన్ కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయమని ప్రకటించారు. “మా భాష, భూమి, నీటి విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే సహించబోము” అని మంత్రి తంగడగి అన్నారు.

 

కన్నడ సంఘాలు ఇప్పటికే బెంగళూరు, మైసూర్, హుబ్బళి వంటి నగరాల్లో నిరసనలు, పోస్టర్ల దహనాలు, సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు మాట్లాడుతూ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం ఈ వివాదం థగ్ లైఫ్ మూవీ టీమ్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

Exit mobile version
Skip to toolbar