Prime9

Kamal Haasan: మీరు ఏమైనా చరిత్రకారులా.. కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు ప్రశ్న

Karnataka: స్టార్ హీరో కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. దీనిపై కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ రాష్ట్ర భాషను అవమానించినందుకు కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పలు భాష సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. అలాగే సినిమాను విడుదలను నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.

 

కమల్ హాసన్ క్షమాపణలు చెప్తేనే సినిమా విడుదల అవుతుందని కన్నడ ప్రజలు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. కన్నడ భాష విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్ఫష్టం చేశారు. అలాగే జూన్ 5న విడుదల కానున్న థగ్ లైఫ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందన్న వ్యాఖ్యలను ఏ ఆధారాలతో చెప్పారని, మీరేమైనా చరిత్రకారులా అని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. అలాగే తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో ఏం చేయాలోనని కమల్ హాసన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.

Exit mobile version
Skip to toolbar