Prime9

Kannappa hard disk missing: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్.. ప్రభాస్ యాక్షన్ సీన్స్ లీక్…?

Manchu Vishnu’s Kannappa Movie Hard Disk is missing: మంచు విష్ణు కన్నప్ప సినిమాకు మొదటి నుంచి కష్టాలు వస్తున్నాయి. ఒక వైపు ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు.  మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ నత్తనడకవేయడంతో రిలీజ్ డేట్  మూడుసార్లు వాయిదా పడింది. తాజాగా సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగ్ అయినట్లు చిత్ర యునిట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ హార్డ్ డిస్క్ లో ఏకంగా 1.30 గంటల సినిమా ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.

 

ఈ హార్డ్ డిస్క్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు చెందిన యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయట. మొదటి నుంచి కన్నప్ప సినిమాకు ప్రభాస్  హైప్ ఇస్తూ వస్తున్నాడు. తాజాగా జరిగిన పరిణామం ప్రకారం ప్రభాస్ కంటెంటే లీక్ అయింది. ప్రభాస్ లాంటి హీరో గెస్ట్ రోల్ లో నటించబమే ఎక్కువ అయినప్పుడు, ఆయన సీన్స్ ఉన్న హర్డ్ డిస్క్ ను సెక్యురిటీ లేకుండా బయటకు ఎలా పంపారని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.

 

ఇప్పటికే మంచు విష్ణు తన ప్రమోషన్ వీడియోలలో చెబుతూ వస్తున్నాడు. ప్రభాస్ లాంటి హీరో కన్నప్ప సినిమాలో నటించడంతో సినిమాకు వెయిట్ పెరిగిందన్నాడు. తన మార్కెట్ కేవలం 20 నుంచి 30 కోట్లవరకే ఉందని.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ నటించడంతో సినిమా రేంజ్ పెరిగినట్లు ఓపెన్ గా చెప్పాడు. తాజాగా సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజాకు ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వూలో కూడా ప్రభాస్ కు మోహన్ బాబుకు ముఖ్యమైన సీన్స్ ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ కు చెందిన హార్డ్ డిస్క్ మాయం అయిందని కుయ్యోమోర్రో అంటున్నాడు. ప్రభాస్ సీన్స్ లీక్ అయితే మాత్రం సినిమాకు చాలా పెద్ద దెబ్బ పడనుంది.

 

సినిమా షూటింగ్ మొదలైన కొత్తలో ప్రభాస్ లుక్ విషయంలో కూడా చాలా గోప్యతను ప్రదర్శించిన చిత్ర టీం. ఆతర్వాత ఆయన లుక్ ను మాత్రమే రిలీజ్ చేయడంతో సినిమాకు చాలా హైప్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయంపై గోప్యతను ప్రదర్శించింది. ఇదిలాఉంటే..  మిస్సింగ్ కు గురైన హార్డ్ డిస్క్ లో ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ ఉన్నయట, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేకోణంలో విషయాన్ని బయట పెట్టలేదని చెబుతున్నారు.  ఇప్పుడు అసలు హార్డ్ డిస్క్ అదీను 1.30 గంటల ఫీడ్ ఉన్నది మిస్ అవడంతో మూవీ మేకర్ప్ ఆందోళన చెందుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar