Jyotika Reacts on Kanguva Negative Reviews: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కంగువా మూవీ దారుణంగా బోల్దా కొట్టింది. సూర్య హీరో డైరెక్టర్ శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించాడు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ. 350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం రూ. 160 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
సెకండాఫ్ బాగున్న తొలి అరగంట మూవీ బోర్ కొట్టించింది. అలాగే పాటలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక బ్యాగ్రౌండ్ బీజీయం క్రింజ్‌గా అనిపించందనే టాక్ వచ్చింది. దీంతో సినిమా చూసేందుకు ఆడియ్స్ ఎవరూ ఆసక్తి చూపించలేదు. కంగువాకి వచ్చిన నెగిటివ్ రివ్యూలో అప్పట్లోనే సూర్య భార్య, నటి జ్యోతిక స్పందించింది. కంగువ అద్భుతమైన సినిమాని, థియేటర్లలోనే చూడాల్సిన చిత్రమన్నారు. తొలి అరగంట మాత్రం బాగాలేదని, అది తాను కూడా ఒప్పుకుంటానంది.
కానీ, ఇందులో యాక్షన్ సీన్స్, సెకండాఫ్ విజువల్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ మూవీకి సపోర్టు ఇచ్చింది. ఫస్ట్ డేనే మూవీ ఇంత నెగిటివిటీ చూస్తుంటే బాధగా ఉందని, కావాలనే సూర్య సినిమాను తొక్కెస్తున్నారంటూ తన అభిప్రాయన్ని తెలిపింది. అయినా కూడా నెగిటివ్ టాక్‌కి మాత్రం బ్రేక్ పడలేదు. తాజాగా మారోసారి కంగువా రిజల్ట్‌పై జ్యోతిక స్పందించింది. ఆమె నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె కంగువా చిత్రానికి వచ్చిన నెగిటివిటీపై స్పందించింది. “కొన్ని సినిమాలు ఏమాత్రం బాగోవు.
కానీ అవి కమర్షియల్‌గా బాగా హిట్ అవుతాయి. వాటికి మంచి రివ్యూలు ఇస్తుంటారు. కానీ నా భర్త(సూర్య) సినిమా(కంగువాను ఉద్దేశిస్తూ) విషయానికి వస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించారనిపిస్తుంది. సినిమాలో బాగోలేని కొన్ని సన్నివేశాలు ఉండోచ్చు.. కానీ ఆ మూవీ కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. ఆ కష్టం కళ్ల ముందు స్పష్టం కనిపిస్తుంది. అయినా కానీ సౌత్‌లో ఉన్న ఎన్నో దారుణమైన సినిమాల కంటే.. కంగువాకు దారుణమైన రివ్యూస్ ఇచ్చారు. అది చూసి నాకు చాలా బాధేసింది” అని జ్యోతిక అసహనం వ్యక్తం చేసింది.