Site icon Prime9

Jurassic World Rebirth: డైనోసర్స్‌ మళ్లీ వస్తున్నాయి – జురాసిక్‌ వరల్డ్‌ రీబర్త్ ట్రైలర్‌ చూశారా?

jurassic world Rebirth trailer

jurassic world Rebirth trailer

Jurassic World Rebirth Trailer: జురాసిక్‌ వరల్డ్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఫ్రాంఛైస్‌కి అభిమానులు ఉన్నారు. జురాసిక్ వరల్డ్‌ నుంచి సినిమా అనగానే అభిమానులంతా సైన్స్‌ ఫిక్షన్‌ వరల్డ్‌లో తేలిపోతుంటారు. హాలీవుడ్‌ దగ్గిజ దర్శకుడు స్టివెన్‌ స్పీల్‌ బర్గ్ జురాసిక్‌ పార్క్ అంటూ ఈ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు యాక్షన్‌, లవ్‌స్టోరీస్‌, హిస్టారికల్‌ చిత్రాలతో అలరించిన ఆయన జురాసిక్‌ పార్క్‌తో సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాడు.

ఇప్పటి వరకు ఫ్రాంఛైజ్‌లో ఏడు సినిమాలు రాగా.. అవన్ని కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజ్‌ నుంచి మరో చిత్రం రాబోతోంది. అదే జురాసిక్‌ వరల్డ్‌: రిబర్త్‌ (JURASSIC WORLD: REBIRTH). ప్రపంచంలోని అన్ని భాషల్లో ఈ ఏడాది రిలీజ్ కాబోతుండటంతో ఆడియన్స్ అంతా ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 04న తెలుగు, ఇంగ్లీష్, త‌మిళ్‌, హిందీ, కన్నడతో పాటు త‌దిత‌రు భాష‌ల‌లో విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ జురాసిక్‌ వరల్డ్‌: రిబర్త్‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. హాలీవుడ్ న‌టి స్కార్లెట్ జోహన్సన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.

ట్రైలర్‌ విషయానికి వస్తే

ఒక పరిశోధన కోసం ఒరిజినల్‌ జురాసిక్‌ పార్క్‌ ఐలాండ్‌కు ఓ రీసెర్చ్ టీం వెళుతుంది. దీనికి స్కార్లెట్‌ జోహాన్సన్‌ స్పెషల్‌ ఏజెంట్‌. అక్కడికి వెళ్లిన వారికి అంతరించిపోయిన రాక్షస బల్లులు మళ్లీ ఆ ఐలాండ్‌లో ఎదురుపడతాయి. ఇంతకాలం తమని తాము ఐసోలేషన్‌ చేసుకున్న ఈ డైనోసర్స్ ఎలా బయటకు వచ్చాయి? ఆ ఐలాండ్‌ వాటిని నుంచి తమని తాము రక్షించుకోవడాని ఈ రీసెర్చ్‌ టీం ఏం చేసిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్‌ మాత్రం ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. ఆ రీసెర్చ్‌ టీం డైనోసర్స్‌తో చేసిన యాక్షన్స్‌ సీన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. 2 నిమిషాల 22 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ క్షణం క్షణం ఉత్కంఠని పెంచుతూ సాగింది. మరి థియేటర్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.

Exit mobile version
Skip to toolbar