Site icon Prime9

Jr NTR Japan Fans Movement: విదేశాల్లో ఎన్టీఆర్‌ క్రేజ్ – తారక్‌ కటౌట్‌ ముందు ఈ లేడీ ఫ్యాన్స్‌ ఏం చేస్తున్నారో చూడండి!

Jr NTR Japan Lady Fans Video Goes Viral: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవెంట్‌ ఏదైనా ఎన్టీఆర్‌ పేరు వినిపిస్తే చాలు కేకలు, అరుపులతో ఫుల్‌ జోష్‌ చూపిస్తుంటారు. ఇక ఆయనకు ఒక్క ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఇప్పుడ మేల్‌ ఫాలోయింగ్‌ని చూశాం. కానీ ఆయనకు విదేశాల్లో మంచి లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌. ఎన్టీఆర్‌ మీద అభిమానంతో తాజాగా విదేశీ ఫీమేల్‌ ఫ్యాన్స్‌ చేసిన పని చూస్తే షాక్‌ అవుతున్నారు. ఇంతకి ఏం జరిగింది? ఆ ఫ్యాన్స్‌ ఎక్కడివారో ఇక్కడ చూద్దాం.

ఎన్టీఆర్‌ నటించిన లేటస్ట్‌ మూవీ ‘దేవర’ గతేడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా త్వరలోనే జపాన్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అక్కడ దేవర మూవీ ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్‌ వర్చ్యువల్‌ ద్వారా జపాన్‌ మీడియాతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఇక మూవీ అక్కడ త్వరలో రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో జపాన్‌ థియేటర్లలో ఎన్టీఆర్‌ కటౌట్‌ని భారీ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ కటౌట్‌కి జపాన్‌ మహిళలు పూజలు చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్‌ అవుతుంది. కాగా దేవర మూవీ జపాన్‌ మార్చి 28న విడుదల కానుంది.

Exit mobile version
Skip to toolbar