Prime9

Janhvi Kapoor: నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్వీ కపూర్‌ – వీడియో వైరల్

Janhvi kapoor attend grandmother Nirmal Kapoor funeral: బాలీవుడ్‌ బ్యూటీ, దేవర భామ జాన్వీ కపూర్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ నిర్మల్‌ కపూర్‌ శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ ముంబైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా నానమ్మ అంత్యక్రియల్లో జాన్వీ, కపూర్‌ ఫ్యామిలీ పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్వీకి ఆమె ఫ్యాన్స్‌ అంత ధైర్యంగా ఉండు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

 

కాగా జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ తల్లి అయిన నిర్మల్‌ కపూర్‌ కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 90 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. జాన్వీ కపూర్‌, ఆమె చెల్లిఖుషి కపూర్‌, అనిల్‌ కపూర్‌ తన ఫ్యామిలీ, అర్జున్‌ కపూర్‌తో ఇతర కుటుంబ సభ్యులు, అలాగే బాలీవుడ్‌కి చెందిని సినీ ప్రముఖులు నిర్మల్‌ కపూర్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా దేవర సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది జాన్వీ కపూర్‌.

 

శ్రీదేవి కూతురికి జాన్వీకి నార్త్‌తో పాటు సౌత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇక ఆమె తెలుగు సినిమాలో నటించడంతో శ్రీదేవి ఫ్యాన్స్‌ అంతా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే దేవరలో తన అందం, అభినయం తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది జాన్వీ. దీంతో ఆమెకు ఇక్కడ మరింత క్రేజ్‌ పెరిగింది. ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్‌ చరణ్‌ సరసన ఆర్‌సీ 16(RC16) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ని శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో జాన్వీ లుక్‌ బయటకు రాలేదు. దీంతో ఆమె అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar