Jack Movie Trailer released Siddhu’s Dialogues Viral: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, హీరోయిన్ వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’. ఈ మూవీ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుండగా.. కొంచెం క్రాక్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
కాగా, ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, సిద్ధూ డైలాగ్స్ ఓ లెవల్‌లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రకాశ రాజ్‌తో హీరో సిద్ధూ సంభాషణలు ఆకట్టుకునేలా ఉండడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇందులో తన మిషన్ పేరు బలర్ ఫ్లై అంటూ హీరో సిద్దూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక, ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.