Jaabilamma Neeku Antha Kopama Trailer: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు డైరెక్టర్‌గానూ సత్తాచాటుతున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ధనుష్ స్వీయ దర్శకత్వంలో సినిమా రూపొందిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీకడై సినిమా చేస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ తెరకెక్కిస్తున్నాడు.
తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా రాబోతోంది. తమిళంలో ‘నిలవకు ఎన్మేల్ ఎన్నాడి కోబం’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సినిమాలోని సెన్సేషనల్ సాంగ్ గోల్డెన్ స్పారో పాటను తెలుగులో రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ పూర్తి వినోదాత్మకంగా సాగింది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం సాగనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఇక ట్రైలర్ చివరిలో ‘జాలీగా రండి.. జాలీగా వెళ్లండి’ అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. జాబిలమ్మ నీకు అంత కోపమా ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతోంది. పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్,శరణ్య పొన్నవరంలు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా సమర్పణలో ఆర్.కె.ప్రొడక్షన్, వండర్ బాల్ ఫిల్మ్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.