Site icon Prime9

Cannes Film Festival 2024: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో భారతీయ తారల సందడి

Aishwarya Rai

Aishwarya Rai

Cannes Film Festival 2024: 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఫ్రాన్స్‌లో ఫ్రెంచి రేవారాలో ఈ నెల 14 నుంచి 25 వరకు జరుగుతోంది. ఈ కెన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ భారతీయ తారలు తళుక్కుమన్నారు. అశ్వర్యరాయ్ బచ్చన్‌, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ మొట్టమొదటిసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై వయ్యారాలు ఒలకబోశారు. వీరితో పాటు ఆదితిరావు హైదరీలు భారత్‌ టాలెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాగా అమెరికా చెందిన గ్రేటా గెర్విగ్‌ జ్యూరీగా వ్యవహరించారు. కేన్స్‌ 2024 ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సినిమాటిక్‌ ఎక్స్‌లెన్స్‌తో పాటు ఇంటర్నేషనల్‌ స్టార్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రత్యేక ఆకర్షణగా అశ్వర్యరాయ్‌ ..(Cannes Film Festival 2024)

ఇక ఇండియా నుంచి అశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తరచూ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. కాగా ఈ సారి ఆమె తన కుమార్తె ఆరాధ్యతో కలసి వచ్చారు. అయితే ఈ సారి మాత్రం ఆమె కుడి చేతికి గాయం అయ్యింది. ఆర్మ్‌ స్ర్టింగ్‌ ధరించి కనిపించారు. ఆమె ఫోటోలు, వీడియోలు ఎయిర్‌ పోర్ట్‌ నుంచి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న వరకు సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. ఇక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మన తారలు ఎలాంటి దుస్తులు ధరిస్తారు అని ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు. ఇక ఐశ్వర్య విషయానికి వస్తే ఆమె బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో పాటు బ్లూ నీ లెంత్‌ కోట్‌ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కుమార్తె ఆరాధ్య కూడా బ్లూ హూడీ బ్లాక్‌ ప్యాంట్‌ ధరించారు. ఒక వీడియోలో ఆరాధ్య తన తల్లికి సాయం చేస్తున్నట్లు ఆమెహ్యాండ్‌ బ్యాగ్‌ను తీసుకొని నడుచుకుంటూ వచ్చిన వీడియో హల్‌చల్‌ చేసింది.

బాలావుడ్‌ స్టార్‌ శోభితా ధూళిపాళ కూడా 77 కేన్స్‌ 2024 ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమన్నారు. మంకీ మేన్‌లో నటించిన శోభిత గ్లోబల్‌ ప్లాట్‌పాంలో ఐస్‌ క్రీం బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆమె డ్రెస్‌ విషయానికి వస్తే ధగధగ లాడే జంప్‌సూట్‌తో ఆకర్షించారు. డ్రెస్‌కు తగ్గట్టు గోల్డ్‌ జ్యువెలరీ ధరించి అందరిని ఆకర్షించారు. ఆమే కేన్స్‌లో పాల్గొనడం ఇది రెండవసారి. కాగా ఆమె ఫ్యాన్స్‌ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెట్టారు.శోభిత గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. వావ్‌ గోల్డెన్‌ గర్ల్‌ అంటూ కామెంట్లు పెట్టారు.

గాలా డిన్నర్‌లో  కియారా అద్వానీ..

ఇక బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ విషయానికి వస్తే ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాలు పంచుకున్నారు. ఆమె రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫౌండేషన్స్‌ విమెన్‌ ఇన్‌ సినిమా గాలా డిన్నర్‌లో పాల్గొన్నారు. ఇటీవల ఆమె అమీ జాక్‌సన్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కాగా కియారా విమెన్‌ సినిమా ప్యానెల్‌లో ఒక భాగస్వామి. కేన్స్‌లో జరిగిన పలు గ్లోబల్‌ కనర్వేషన్‌ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఒక ఈవెంట్‌లో ఆమె ఆరెంజ్‌ గౌన్‌ ధరించి వావ్‌ అనిపించారు. గోల్డ్‌ హియర్‌ రింగ్‌తో స్టయిలిస్‌ హెయిర్‌ స్టయిల్‌ లుక్స్‌తో అందరిని ఆకర్షించారు. ట్విట్టర్‌లో తను పొల్గొన్న ఈవెంట్‌ల వీడియోలను తన అభిమానుల కోసం షేర్‌ చేశారు.

బాలీవుడ్‌ నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాలు పంచుకున్నారు. మైఖేల్‌ డీ కోచర్‌ డిజైన్‌ చేసిన తళతళ మెరిస షిమ్మరింగ్‌ గౌన్‌తో అందరిని ఆకర్షించారు. పరిమిత స్థాయిలో జ్యువెలరీ ధిరంచి రెడ్‌ కార్పెట్‌పై వయ్యారాలు వలబోశారు. తాను సూపర్‌ ఎగ్జైటెడ్‌గా ఉన్నాని చెప్పారు. సౌత్‌ ఈస్ట్‌ ఏషియాకు గ్లోబల్‌ లెవెల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. బీఎండబ్ల్యుకు ఆమె ప్రాతినిధ్యం వహించారు. బాలీవుడ్‌ నుంచి జాక్విలెన్‌ ఫెర్నాడెజ్‌ కాకుండా ఈ ఏడాది పలువురు బాలీవుడ్‌ నటిమణులు హాజరయ్యారు. వారిలో అశ్వర్యరాయ్‌ బచ్చన్‌తో పాటు శోభితా దూళిపాళతో పాటు ఆదితరావు హైదరి ఊర్వశి రౌతెలా లు ఫ్రెంచ్‌ రెవరా వాతావరణాన్ని మరింత హాట్‌ చేశారు.

 

 

 

Exit mobile version