Grammy Awards 2025: 67వ గ్రామీ అవార్డుల వేడుక అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గ్రామీ అవార్డుల వేడుకకు లాస్ ఏంజెల్స్ వేదికైంది.లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో స్టార్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొని సందడి చేవారు.
ఈ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రిక టాండన్ ఈ అవార్డును అందుకున్నారు. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్‌యాంబియంట్ ఆర్ చాలంట్ ఆల్బమ్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికి ధన్యవాదాలు చెప్పారు. ఈ అవార్డు తనకేంతో ప్రత్యేకమన్నారు.
కాగా చంద్రిక టాండన్‌కు ఇది రెండో గ్రామీ అవార్డు కావడం విశేషం. చెన్నైలో పుట్టి, పెరిగిన చంద్రిక ప్రస్తుతం ఆమెరికాలో స్థిరపడ్డారు. పలు దేశాల్లో వ్యాపారవేత్త రాణిస్తున్న ఆమె పెప్పికో మాజీ సీఈఓ ఇంద్రా నూయూకి ఈమె సోదరి అవుతారు. చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతం అంటే ఇష్టం. ఆమె తల్లి సంగీత విద్వాంసురాలు కావడంతో తల్లి దగ్గరే చంద్రిక శిక్షణ తీసుకుంది. వ్యాపార రంగంలో రాణిస్తూనే సంగీతంతో ఎందరినో మెప్పించింది. తాజాగా ఆమెకు మరోసారి గ్రామీ అవార్డు దక్కడంతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు.