Site icon Prime9

Allu Arjun in Thums Up AD: అల్లు అర్జున్‌ థమ్సప్ యాడ్ కేక.. ఈ డైలాగ్ అదిరిపోయింది భయ్యా..!

Allu Arjun in Thums Up AD

Allu Arjun in Thums Up AD: ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు మూవీస్‌తో పాటు యాడ్స్‌ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్‌ను థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. తాజాగా బన్నీ థమ్సప్ కొత్త యాడ్‌‌లో నటించారు. ఈ యాడ్‌ను థమ్స‌ప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

థమ్సప్‌ కొత్త యాడ్‌ ఐకాన్ స్టార్ట్ చెప్పే ‘సిచ్యువేషన్‌ ఎలాంటిదైనా ఒక్క సిప్ చేయ్’ అనే డైలాగ్ అదిరిపోయింది. ఈ యాడ్ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు, థమ్సప్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో థమ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా మెగాస్టార్ చిరంజీవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు వ్యవహరించారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇటీవల పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామి సృష్టించారు. దాదాపు రూ.1850 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

Exit mobile version