Site icon Prime9

Will Smith: సాలెపురుగు వచ్చిందని ఇల్లునే అమ్మేస్తానంటున్న స్టార్ హీరో

will smith prime9news

will smith prime9news

Hollywood: హాలీవుడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌ తెలియని వాళ్లంటూ ఎవరు లేరు. ఆస్కార్‌ కమిటీ విల్ స్మిత్ ను పదేళ్ళ నిషేధం విధించడం, ఆ తరువాత ఆస్కార్‌ కమిటీలో తన పదవికి విల్‌స్మిత్‌ రాజీనామా చేయడం, అతని చేసి తప్పుకు క్రిస్‌రాక్‌కు క్షమాపణలు చెప్పడం ఇలా జరిగాయన్న సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంటులో ఫన్నీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

విల్‌ స్మిత్‌ తన ఇంట్లోకి వచ్చిన ఒక సాలీ పురుగును చూసి స్మిత్‌ భయపడిపోయాడు. ‘వార్నీ, ఇది ఏంటి ఇంత పెద్దగా ఉంది, నేను ఇక్కడ కుర్చీలో కూర్చొన్నానుగా, నువ్వు వెళ్లి దాన్ని పట్టుకుని బయట వదిలేయ్ అంటూ నువ్వు యంగ్‌ బాయ్ వీ అలాగే బలంగా ఉంటావు, నువ్వైతే బాగా హ్యాండిల్‌ చేయగలవు, నువ్వు వెళ్లు’ అంటూ సాలీ పురుగును పట్టుకునే బాధ్యతను కొడుక్కి ఇచ్చాడు. మొత్తానికి తండ్రీకొడుకులు కలిసి ఆ సాలి పరుగును ఓ గాజు గ్లాస్ లో పట్టుకొని బంధించారు. ‘ఈ సాలి పురుగులతో రోజూ మాకు పెద్ద తలనొప్పి వస్తుంది ముందు ఈ ఇంటిని అమ్మేయలంటూ అని సరదాగా వీడియోలో చెప్తాడు స్మిత్‌. ఇది చూసిన స్మిత్ అభిమానలందరు కనిపించింది ఒక్క పురుగు దానికే మీరు ఇల్లును అమ్మాలనుకుంటారా ? ఇది చూడటానికి మీకు మాకు కామెడి లాగా ఉంది. ‘మా ఇంట్లోకి రోజు ఇలాంటివి సాలి పురుగులు చాలా కనిపిస్తాయి, మీరు ఒక్కదానికే అంతలా భయపడుతున్నారు అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

 

Exit mobile version