Prime9

Hero Vishal Marriage: హీరో విశాల్‌ పెళ్లి ఫిక్స్‌.. ఆ హీరోయిన్‌తోనే ఏడడుగులు.. అతి త్వరలోనే ప్రకటన!

Vishal Wedding Rumours With Actress Sai Dhanshika: తమిళ్‌ హీరో విశాల్‌ పెళ్లి వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యం వార్తలతో విశాల్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యంపై ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పెళ్లి వార్తలు తెరపైకి రావడం విశేషం. కాగా కోలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచీలర్స్‌లో విశాల్‌ ఒకరు. నిజానికి అక్కడ ఆయన జనరేషన్‌లోని హీరోలందరు పెళ్లి చేసుకున్నారు. అక్కడ శింబు, విశాల్‌లు మాత్రమే బ్యాచీలర్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

 

ఈ క్రమంలో తరచూ వారిద్దరి పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌ అవుతున్నాయి. గతంలోనూ విశాల్‌ పెళ్లిపై ఎన్నోసార్లు వచ్చాయి. కానీ అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. గతంలో ఓ నటితో విశాల్‌ నిశ్చితార్థం జరిగింది. కొన్ని, కారణాల వల్ల అది పెళ్లి వరకు వెళ్లలేదు. అప్పటి నుంచి విశాల్‌ ఓ ఇంటివాడు ఎప్పుడు అవుతాడు, పెళ్లి కబురు ఎప్పుడు చెబుతాడా అని ఫ్యాన్స్‌ ఆసక్తికిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాల్‌ పెళ్లిపై కోలీవుడ్‌ మీడియాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

 

ఈ తాజా బజ్‌ ప్రకారం.. విశాల్‌ త్వరలోనే హీరోయిన్‌ ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయి ధన్సిక కానీ, విశాల్‌ కానీ స్పందించ లేదు. ఇటవల నడిఘర్‌ సంఘం భవన నిర్మాణం కూడా పూర్తయిన సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నాది ప్రేమ వివాహమేనని, త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పాడు.

 

కాగా విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ వినిపిస్తున్న టాక్‌ ప్రకారం విశాల్‌ ఇవాళ పెళ్లి ప్రకటన చేయనున్నాడని తెలుస్తోంది. సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమాలో కార్యక్రమానికి అతడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నాడట. ఈ రోజు సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో విశాల్‌ మాట్లాడుతూ తన పెళ్లి ప్రకటన చేయనున్నాడని, సాయి ధన్షికతో తన రిలేషన్‌, పెళ్లిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నాడని అతడి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Exit mobile version
Skip to toolbar