Prime9

Tollywood Hero Childhood Pic: ఈ ఫోటోలోని బుడ్డోడు ఇప్పుడో పాన్ ఇండియా హీరో – వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు, ఎవరో గుర్తుపట్టారా?

Tollywood Star Hero Shared His Childhood Photo: సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి విషయమైన అభిమానులకు అది ఆసక్తికర అంశం. వారి లైఫ్ స్టైల్‌, డైయిలీ యాక్టివిటిస్‌పై తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. ఇక తమ అభిమాన హీరోహీరోయిన్లకు సంబంధించిన రేర్‌ ఫోటోలు కనిపిస్తే వాటిని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే ఓ స్టార్‌ హీరో చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎవరో కాదు స్వయంగా ఆ హీరోనే షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చిన్ననాటి పిక్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా! అయితే ఇక్కడ మీకో హింట్‌..

 

చూడటానికి పక్కింటి అబ్బాయిల ఉంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన హీరో. తన సహజమైన నటనతో నేచురల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ దూసుకుపోతునాడు. ఇటీవల ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కూడా కొట్టాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో వచ్చిన ఈ హీరో ఆ తర్వాత అనుకోకుండ హీరో అయ్యాడు. మెల్లిమెల్లిగా తన నటనను పెంచుకుంటూ, విభిన్న కథలను చేసుకుంటూ ఇప్పుడ పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఈ హీరో సినిమా అంటూ పక్కా హిట్ అనేంతగా దర్శక-నిర్మాతలకు నమ్మాకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు హీరోగానే కాదు నిర్మాతగాను మారి సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

 

హీరో, నిర్మాతగా కెరీర్‌లో సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. ఎవరో గుర్తొచ్చింది. అవును.. మీరు అనుకుంటున్న హీరో.. ఆయనే నేచురల్‌ స్టార్‌ నాని. హీరోగా హిట్‌ 3, నిర్మాతగా కోర్ట్‌ మూవీతో సూపర్‌ హిట్‌ అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మరోవైపు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు లైన్లో పెట్టిన ఈ హీరో తాజాగా తన చిన్ననాటి ఫోటో షేర్‌ చేశాడు. తనతో పాటు తన అక్కతో దిగిన ఫోటోని పంచుకున్నాడు. మే 20 నాని సోదరి దీప్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ.. ఆమెతో చిన్నప్పుడు దిగిన ఫోటోని షేర్‌ చేశాడు. దీనికి “హ్యాపీ బర్త్‌డే అక్కీ.. నువ్వు ఇక్కడ ఉన్నావ్‌. ఇక నీతో కలిసి మరెన్నో వేడుకలు జరుపుకునేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా” అంటూ అక్కకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.

 

కాగా నాని సోదరి కూడా ఇండస్ట్రీకి చెందినవారే అనే చాలా తక్కువ మందికి తెలుసు. ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్‌ ఫిలింకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే తన తమ్ముడు నానితో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. మీట్‌ క్యూట్‌ అనే చిత్రానికి ఆమె ఆమె దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అ!, హిట్‌ ఫ్రాంచైజ్‌, కోర్ట్‌ చిత్రాలకు నాని వాల్‌ పోస్టర్‌ సినిమాతో కలిసి ఆమె పని చేశారు. అలా దర్శకురాలిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సైలెంట్‌గా రాణిస్తూ వస్తున్నారు. నాని సోదరి బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు కూడా ఆమెకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరో అయిన నాని చిన్ననాటి ఫోటోని రీషేర్‌ చేస్తూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్‌.

Exit mobile version
Skip to toolbar