Site icon Prime9

Hebah Patel: శాసనసభలో హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్

Hebah Patel Special Song In Sasanasabha

Hebah Patel:  ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ సంగీత ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుందని తెలిపారు. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.

సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

Exit mobile version