Site icon Prime9

Netizens fires on Chiranjeevi: చరణ్‌ మళ్లీ ఆడిపిల్లనే కంటాడేమో అని భయమేసి.. చిరంజీవి వ్యాఖ్యలపై నెటిజన్ల రియాక్షన్‌..!

Chiranjeevi Comments on Legacy Goes Viral on: బ్రహ్మా ఆనందం మూవీ ఈవెంట్‌లో మెగస్టార్‌ చిరంజీవి చేసన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హాస్య నటుడు బ్రహ్మానందం ఆయన తనయుడు గౌతమ్‌ రాజా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానున్న నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్‌ సుమ క్లింకార వాళ్ల తాతయ్య ఫోటో అంటూ ఫ్యామిలీతో ఉన్న పిక్చర్‌ని చూపించింది.

దీనికి ఆయన స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. నాకు ఇంట్లో మనవరాళ్లతో ఉన్నట్టు ఉండదు.. గర్ల్స్‌ హాస్టల్‌కి వార్డెన్‌గా ఉన్నానా? అనిపిస్తుంది. చూట్టు అందరు ఆడపిల్లలే. అందుకే చరణ్‌ ఈసారి కూడా ఆడపిల్లనే కంటాడేమోనిన భమేసి.. ‘ఒక మగపిల్లాడిని కనరా.. మన లెగిసీని కంటిన్యూ చేస్తాడు’అని అడిగా” అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌పై నెటిజన్స్‌ రకరకాలు స్పందిస్తున్నారు. మహిళలు మాత్రం ఆయన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీ లాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం, వినడం బాధాకరంగా ఉందంటున్నారు. వారసత్వాన్ని కంటిన్యూ చేయాలంటే మగపిల్లలే కావాలా? ఆడిపిల్లలు చేయరా? అని ప్రశ్నిస్తున్నారు. ఓ ట్విటర్‌ యూజర్‌ చిరంజీవి వీడియోని షేర్‌ చేస్తూ.. “చిరంజీవి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆడపిల్లల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను” అని మండిపడ్డారు. మరొకొందరేమో.. 2025లో కూడా ఇలాంటి వారు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరోక ట్విటర్‌ యూజర్‌ చిరంజీవి మాటల అర్ధాన్ని వివరించారు. “అమ్మాయిలతో నిండిన ఇంట్లో అబ్బాయిని కోరుకోవడంలో తప్పు లేదు. ఎవరైనా అబ్బాయిని మాత్రమే కోరుకుని, అమ్మాయిని కనడాన్ని విస్మరించినప్పుడు సమస్య తలెత్తుతుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరినీ కోరుకోవడం అనేది పక్షపాతం కాదు, సమతుల్యతకు సంబంధించినది” అని పేర్కొన్నారు. ఇలా నెటిజన్లు చిరు వ్యాఖ్యలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలా వారసుడిపై ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారతీశాయి. మరి దీనిపై చిరు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Exit mobile version
Skip to toolbar