Site icon Prime9

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’ మూవీ మళ్లీ వాయిదా? – క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

Makers Confirms on Hari Hara Veeramallu Movie Release: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ మూవీపై కొద్ది రోజులుగా రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదని, దీంతో రిలీజ్‌ డేట్‌ వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో పవర్‌స్టార్‌ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్‌పై మూవీ టీం స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేసిన రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది.

 

బిజీ బిజీగా ‘వీరమల్లు’

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఆయన సంతకం చేసిన సినిమాలు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌ కంటే కూడా ఆయన ఎక్కువగా డిప్యూటీ సీఎం తన సేవలు అందించడంలోనే బిజీగా ఉన్నారు. వీలు కుదిరినప్పుడల్లా సెట్‌లో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో తరచూ సినిమా షూటింగ్స్‌ వాయిదా పడుతున్నాయి. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన హరి హర వీరమల్లు మూవీ తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఫిబ్రవరి 28న మూవీని రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు.

 

వీరమల్లు వాయిదా అంటూ వార్తలు

కానీ అప్పటికి ఇంకా షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మూవీని మే 9న విడుదల చేస్తామని ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. అయితే మూవీ రిలీజ్‌కు ఇంకా నెల రోజులే ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. నెల రోజుల్లోనే సినిమా డబ్బింగ్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ చేయాలి. ఇదంతా సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు మూవీ టీం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. దీంతో మూవీ రిలీజ్‌ ఎన్నో సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

మే 9న రిలీజ్ 

ఈసారి కూడా చెప్పిన టైం వీరమల్లు రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై మూవీ టీం స్పందించింది. హరి హర వీరమల్లు షూటింగ్‌ పూర్తయ్యిందని, ప్రస్తుతం రీ రికార్డింగ్‌, డబ్బింగ్‌ వర్క్‌ జరుగుతున్నట్టు తెలిపింది. “రీ రికార్డింగ్, డబ్బింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ శరవేగంగా జరగుతున్నాయి. ఇదివరకు ఎన్నడు చూడని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం సిద్ధంగా ఉండండి. ఈ సమ్మర్‌కు మీకు అద్భుతమైన విజువల్‌ వండర్‌ అందిచబోతున్నాం. మే 9న హరి హర వీరమల్లును థియేటర్లలో చూసేందుకు తయారవ్వండి” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసి అభిమానులంత హమ్మయ్య అనుకుంటున్నారు. ఇక మే 9న థియేటర్లలో జాతరే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar