Site icon Prime9

Hanu Raghavapudi : బాలీవుడ్ లో మల్టీ స్టారర్ తెరకెక్కించనున్న హను రాఘవపూడి… హీరోలు ఎవరంటే?

hanu raghavapudi going to durect multistarrer in bollywood

hanu raghavapudi going to durect multistarrer in bollywood

Hanu Raghavapudi : వరుస పరాజయాల తర్వాత హను రాఘవపూడి సీతా రామం సినిమాతో పుంజుకున్నాడు. తెలుగులో ఈ సినిమా చాలా మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత హిందీలో విడుదలై అక్కడకూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. అంతేకాదు ఈ చిత్రం హిందీలో విమర్శకుల ప్రశంసలు పొందింది. సీతా రామం సినిమాతో బాలీవుడ్ జనాలు బాగానే ఆకట్టుకున్నారు హను.

తాజా సమాచారం ప్రకారం హను ఇపుడు హిందీ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు ప్రముఖ హీరోలతో మల్టీస్టారర్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదట్లో ఇద్దరు తెలుగు స్టార్స్ తో ఈ మల్టీ స్టారర్ తీయాలనుకున్నాడు హను. కానీ ఏదో ఒకవిధంగా పనులు జరగలేదు. ఎట్టకేలకు ఇద్దరు బాలీవుడ్ స్టార్లను మెప్పించగలిగాడు. . ఇటీవలే చర్చలు ముగించుకుని హను ముంబై నుంచి తిరిగొచ్చాడు.

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది. ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది. సందీప్ రెడ్డి వంగా, గౌతం తిన్ననూరి, శైలేష్ కొలను సరసన హను రాఘవపూడి కూడ చేరుతున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version