Site icon Prime9

Mark Shankar Photo: ఆక్సిజన్ మాస్క్ తో మార్క్ శంకర్.. ఫోటో వైరల్!

AP Deputy CM Pawan Kalyan's younger son Mark Shankar is recovering in a Singapore hospital

AP Deputy CM Pawan Kalyan's younger son Mark Shankar is recovering in a Singapore hospital

Pawan Kalyan’s Son Mark Shankar Photo with Oxygen Mask: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో  జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరుకున్న విషయం తెల్సిందే. చిన్న ప్రమాదం అనుకున్నా కూడా దాని తీవ్రత ఎక్కువగానే ఉందని పవన్ చెప్పుకొచ్చారు. మార్క్ కు చేతికి, కాళ్లకు గాయాలు అయ్యాయని. పొగ ఊపిరితిత్తుల లోపలికి వెళ్లిందని, ప్రస్తుతం అతనికి సింగపూర్ లో చికిత్స జరుగుతుందని పవన్ తెలిపారు.

 

కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్, చిరంజీవీ దంపతులు, అన్న అకీరా, అక్క ఆద్య కూడా సింగపూర్ బయలుదేరారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని  వైద్యులు తెలిపారు.

 

తాజాగా మార్క్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నోటికి మాస్క్, చేతికి గాయాలతో మాస్క్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోను బట్టి మార్క్ ఆరోగ్యం కోలుకుంటున్నట్లే కనిపిస్తుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. మార్క్ త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలనికోరుకుంటూ  కామెంట్స్ పెడుతున్నారు.

 

పవన్ కళ్యాణ్-  అన్నా లెజినోవా దంపతులకు  రెండో సంతానంగా 2017, అక్టోబర్ 10 న మార్క్ జన్మించాడు. ఎప్పుడు అకీరా, ఆద్యనే కెమెరా కంటికి కనిపిస్తారు. మార్క్ ను పవన్ సింగపూర్ లోనే చదివిస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ దంపతులు వెళ్లి కొడుకును చూసి వస్తారు. కొద్దిసేపటిలో పవన్, మార్క్ ఫోటో కూడా అధికారికంగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

 

Exit mobile version
Skip to toolbar