Site icon Prime9

Mark Antony: మార్క్ ఆంటోని గా వస్తున్న విశాల్

Mark Antony

Mark Antony

#Mark Antony: నటుడు విశాల్ 33వ చిత్రానికి మార్క్ ఆంటోని అని నామకరణం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విశాల్‌ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది, ఇందులో విశాల్ సరికొత్త మేకోవర్‌లో కనిపించాడు.

విశాల్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించడం విశేషం. గడ్డంతో, ముఖానికి విబూదినామాలతో శాల్ భయానకంగా ఉన్నాడు. అతను తుపాకీని పట్టుకుని కాల్చుతున్నాడు. పోస్టర్ ని బట్టి చూస్తే పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. మార్క్ ఆంటోనీ’లో దర్శకుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తారు.

Exit mobile version