Aditya Singh Rajput: ముంబైలో ప్రముఖ నటుడు, మోడల్ మరియు కాస్టింగ్ కోఆర్డినేటర్ అయిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్, అతను నివసించే 11వ అంతస్తులోని వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడు. అతని స్నేహితుడు బిల్డింగ్ వాచ్‌మెన్‌తో కలిసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకువెళ్లిన తరువాత అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఎక్కువ మోతాదులో డ్రగస్ తీసుకోవడం వల్లనే ఇది జరిగినట్లు భావిస్తున్నారు.
ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్ మరియు నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. అతను చాలా మంది కొత్త వారిని పరిచయం చేసాడు. అతను పరిశ్రమతో బాగా కనెక్ట్ అయ్యాడు. బహుళ నటులతో పలు బ్రాండ్‌లకు పనిచేశాడు. అతని మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢిల్లీకి చెందిన ఆదిత్య క్రాంతివీర్ మరియు మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు.
300 ప్రకటనల్లో నటించాడు..(Aditya Singh Rajput)
ఆదిత్యయ దాదాపు 300 ప్రకటనలలో నటించాడు. స్ప్లిట్స్‌విల్లా 9 వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ 4 తదితర టీవీ ప్రాజెక్ట్‌లు చేశాడు. కాస్టింగ్‌లో ఎక్కువగా ఉన్న ఆదిత్య ముంబై గ్లామర్ సర్క్యూట్‌లో ప్రసిద్ధి చెందాడు. పార్టీలు మరియు పేజీ 3 ఈవెంట్‌లలో రెగ్యులర్‌గా ఉండేవాడు.ఆదిత్య కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. కానీ పని కారణంగా, ఆదిత్య అంధేరి లోఖండ్‌వాలాలోని లష్కరియా హైట్స్ అనే భవనంలో రూమ్‌మేట్‌తో కలిసి ఉంటున్నాడు.