Site icon Prime9

Drishyam 2 : రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘దృశ్యం 2’

'Drisham 2'

'Drisham 2'

Bollywood News: చాలాకాలం తరువాత బాలీవుడ్ మరలా సందడిగా మారింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అందరిలోనూ ఒక రకమైన జోష్ వచ్చింది. ఎందుకంటే వరుస ప్లాపులతో అల్లాడిపోయి దిక్కుతోచకుండా ఉన్న బాలీవుడ్ కు ‘దృశ్యం 2’ ఊపిరిపోసింది. విడుదలయిన వారంరోజుల్లోనే వందకోట్ల క్లబ్ లో చేరింది.

మలయాళంలో రూపొందించబడిన ’దృశ్యం’ చిత్రం హిందీతో సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ భాషలలో రీమేక్ చేయబడింది, ఇందులో అజయ్ దేవగన్, శ్రియ మరియు టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఒరిజినల్ సీక్వెన్స్ ‘దృశ్యం 2’కి రీమేక్ కూడా ఇటీవలే విడుదలైంది.’దృశ్యం 2’ లొ అక్షయ్ ఖన్నా కేసును మళ్లీ తెరవాలనుకునే పోలీసుగా నటించారు. గత వారాంతంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు మంచి ఆదరణను పొందింది.థ్యాంక్ గాడ్ ప్లాప్ తర్వాత, అజయ్ దేవగన్ కు కూడ హిట్ లభించింది.

‘దృశ్యం 2’ 7వ రోజున రూ.9.20 కోట్లు వసూలు చేసింది. మొత్తం కలెక్షన్లు రూ.104.54 కోట్లు – రూ 105.24 కోట్ల మధ్య ఉన్నాయి. హిందీ బాక్సాఫీస్ ట్రెండ్ ప్రకారం, ఇది ఈ సంవత్సరం బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.

Exit mobile version