Site icon Prime9

Ram Charan: చిరుత సినిమాకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా.. అతడి కెరీరే మారిపోయి ఉండేది

chirutha mehar ramesh story

chirutha mehar ramesh story

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్.. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే చరణ్.. మంచి మార్కులే అందుకున్నాడు. ఆ తరువాత మగధీర సినిమాతో స్టార్ గా మారాడు. అయితే మొదట చిరుత సినిమా కోసం అనుకున్నది చరణ్ ను కాదట. అసలు ఆ కథే చరణ్ కోసం రాసింది కాదట.

 

అవును.. చిరుత కథ రాసింది పూరి జగన్నాథ్ కాదు.. మెహర్ రమేష్ అంట. ఈ విషయాన్నీ ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ కథ అసలు పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ చేయాల్సిందట. మెహర్ రమేష్ ఈ కథను రాసుకొని సాయి రామ్ శంకర్ తో సగం షూటింగ్ కూడా చేసాడట. కానీ, కొన్ని కారణాల వలన ఆ షూట్ ఆగిపోయింది.

 

కొన్నేళ్ల తరువాత  అశ్వినీదత్ కు మెహర్ రమేష్ దగ్గర  ఒక కథ ఉందని తెలిసి సంప్రదించగా ఆగిపోయిన చిరుత కథను చెప్పుకొచ్చాడు. అదే కథ పూరీకి కూడా తెలిసి ఉండడంతో కొన్ని కొన్ని మార్పులు చేసి.. చిరుత కథను మెగాస్టార్ వద్దకు తీసుకెళ్లారు. అది ఆయనకు నచ్చడం.. చిరుత టైటిల్ కూడా పర్ఫెక్ట్ గా కుదరడంతో రామ్ చరణ్ ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది.

 

సినిమాలో పూరీ.. చరణ్ ను చూపించిన విధానం మారినంత ఆకట్టుకోవడంతో మంచి విజయాన్ని అందుకుంది. ఒకవేళ చరణ్ కాకుండా చిరుత సినిమాను సాయిరామ్ శంకర్ తీసి ఉంటే అది అతని కెరీర్ ను మార్చేసి ఉండేది అని కూడా  ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఎవరికి దక్కాల్సిన కథ వారి కోసం రాసి పెట్టి ఉంటుంది అంటే ఇదేనేమో. చిరుత సాయిరామ్ శంకర్ తో మొదలవ్వడం, షూటింగ్ కూడా మొదలుపెట్టి సగంలో ఆగిపోవడం.. చివరికి అదే కథ చరణ్ వద్దకు రావడం.. అంతా రాసిపెట్టి ఉంది అని చెప్పుకొస్తున్నారు.

 

ఇక చిరుత కథను అడిగిన వెంటనే ఇచ్చిన మెహర్ ను కూడా అశ్వినీదత్ వదలలేదు. ఆయనకు మంచి అవకాశాలనే అందించాడు. కానీ, అవేమి అంతగా విజయాలను అందుకోలేదు. అలా మెహర్ రమేష్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.  మరి ముందు ముందు మెహర్ మరోసారి మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.

Exit mobile version
Skip to toolbar