Site icon Prime9

AR Rahman: కాపీ రైట్‌ కేసు – ఢిల్లీ హైకోర్టులో ఏఆర్‌ రెహమాన్‌కు చుక్కెదురు.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే..

ar rahman

ar rahman

HC Says AR Rahman to deposit Rs 2 Cr in copyright case: ఆస్కార్‌ అవార్డు గ్రహిత, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఓ పాట కాపీ రైట్‌ కేసులో ఆయనకు షాక్‌ తగిలింది. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలోని ఓ పాటపై వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వీరా రాజ వీరా అనే సంగీతాన్ని ఏఆర్‌ రెహమాన్‌ కాపీ కొట్టారంటూ కోర్టు పిటిషన్‌ దాఖలైంది.

 

తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం రెహమాన్‌, మూవీ టీం షాకిచ్చింది. కాపీ రైట్‌ కింద పిటిషనర్‌కి రూ. 2 కోట్లు చెల్లించాల్సిందేనని రెహమాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను హైకోర్టు ఆదేశించింది. కాగా చియాన్ విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, జయం రవి, త్రిష, కార్తి తదితరులు ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ రెండు సిరీస్‌లకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

 

అయితే 2023లో విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌ 2లో వీరా రాజ వీరా అనే పాట కాపీ రైట్‌ వివాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ పాటలోని సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్‌ డగర్‌, మామ జహిరుదీన్‌ డగర్‌ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్టు వారి తనయుడు సింగర్‌ ఉస్తాద్‌ ఫియాజ్‌ వసిఫుదీన్‌ డగర్‌ న్యూఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టి మధ్యంతర తీర్పు వెలువరించింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌, నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌ పటిషనర్‌కి రూ. 2కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

Exit mobile version
Skip to toolbar