Site icon Prime9

Court Movie Day 2 Collections: రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ – ‘కోర్ట్’ మూవీ కలెక్షన్స్‌ ఎంతంటే!

Court Movie Day 2 Box Office Collections: నాని నిర్మించిన ‘కోర్ట్: స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడి’ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏం లేకపోయినా.. కంటెంట్‌తోనే ఆకట్టుకుంటుంది. రోటిన్‌ కోర్టు డ్రామా అయినప్పటికి ఫ్యామిలీ ఎమోషనల్‌తో ఆకట్టుకుంటోందంటూ రివ్యూస్‌ వస్తున్నాయి. తొలిరోజే పాజిటివ్‌ టాక్‌ రావడంతో మూవీ చూసేందుకు ఆడియన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ లాభాల్లో చేరిందని ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం.

నటుడు, కమెడియన్‌ ప్రియదర్శి లీడ్‌ రోల్లో హర్ష రోషన్‌, శ్రీదేవి, బిగ్‌బాస్‌ శివాజీ, రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది ఈ సినిమా. రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. హోలీ సందర్భంగా మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి మూవీ పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. దీంతో తొలి రోజు మూవీ రూ. 8.10కోట్లపైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది.

ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. రెండు రోజుల్లోనే రూ. 15.90 కోట్ల గ్రాస్‌ చేసినట్టు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అప్పడే కోర్ట్‌ బ్రేక్‌ ఈవెన్‌ సాధించిందని, రెండు రోజుల కలెక్షన్స్‌తోనే ఈ చిత్రం నిర్మాతలను లాభాల్లో పడేసిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ మూవీ బడ్జెట్‌ సుమారు రూ. 10 కోట్ల వరకు అయ్యిందట. రిలీజ్‌కు మూవీ కోర్ట్‌ ఓటీటీ, ఆడియో రైట్స్‌ అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు పెట్టుబడి కూడా రెండు రోజుల్లోనే తిగిగొచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో కోర్ట్‌ మూవీ టీం పండగ చేసుకుంటుంది. ఈ మూవీ కలెక్షన్స్‌ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్లలో చూడదగ్గ సినిమా లేకపోవడం కోర్ట్‌ మూవీకి మరింత కలిసోచ్చిందనే చెప్పాలి. మరో వారం కొత్త సినిమాలు కూడా లేకపోవడంతో కోర్ట్‌ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి.

Exit mobile version
Skip to toolbar