Site icon Prime9

Waltair Veerayya : ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో వాల్తేరు వీరయ్యకు ఆన్ లైన్ బుకింగ్స్…

chiranjeevi waltair veerayya movie creating records in overseas bookings

chiranjeevi waltair veerayya movie creating records in overseas bookings

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ”వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలకు విశేష స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా… సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ లో ఆతృత పెరిగింది. కాగా అమెరికాలో ఈ చిత్రం ఓ రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీన యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించనుండగా… ఇందు కోసం ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచింది.

అమెరికాలో శ్లోకా ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ మేరకు మెగాస్టార్ సినిమాని చూడడానికి భారీ స్థాయిలో అడ్వాన్స్ డ్ బుకింగ్స్ వస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే దాదాపు 80 లక్షల రూపాయల విలువ చేసే టికెట్లను బుక్ చేసుకున్నాట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో బాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ మానియా మొదలైంది అని పోస్ట్ లు చేస్తూ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రిలీజ్ అంటే పండుగ వాతావరణం కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

Exit mobile version