Site icon Prime9

Chiranjeevi: సినీ ప్రముఖులతో ప్రధాని సమావేశం – మోదీకి చిరంజీవి ధన్యవాదాలు

Chiranjeevi Thanks to PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెగాస్టార్‌ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారతీయ సినీపరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులతో పాటు వ్యాపారవేత్తలను కలిపి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది చివరిలో వరల్డ్‌ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌'(waves)ను కేంద్రం నిర్వహించనుంది.

ఈ మేరకు మోదీ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో వర్చ్యూవల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ కాన్ఫిరెన్స్‌లో బాలీవుడ్‌ సినీ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొనె, అనిల్‌ కపూర్‌, ఆమిర్‌ ఖాన్‌, అనుపమ్‌ ఖేర్‌, హేమమాలిని ఉన్నారు. ఇక సౌత్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, నాగార్జున, ఏఆర్‌ రెహమాన్‌లతో మోదీ కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో తనని భాగంగా చేసినందుకు ప్రధానీ మోదీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు మోదీతో వర్చ్యువల్‌గా మాట్లాడుతున్న వీడియోని తన ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ బోర్డులో భాగంగా కావడం సంతోషంగా ఉందని, తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. “గౌరవనీయులైన ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీకి గౌరవానికి ధన్యవాదాలు. డ‌బ్ల్యూఏవీఈఎస్ (WAVES) సలహా బోర్డులో భాగం కావడం, ఇతర గౌరవనీయ సభ్యులతో పాటు నా అభిప్రాయాల‌ను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం. మోదీ జ్ఞాన సంతానం అయిన WAVES ఇండియా తాలూకు ‘సాఫ్ట్ పవర్’ను ప్రపంచంలో దాని అర్హమైన ఎత్తులకు నడిపిస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే అన్ని ఉత్సాహాలకు, కొత్త పునాదులకు సిద్ధంగా ఉండండి” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Exit mobile version
Skip to toolbar