Site icon Prime9

Chiranjeevi Emotional Post: ఆమె మరణం నన్నేంతో బాధించింది – చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

Chiranjeevi Shared Emotional Post: దర్శకుడు మెహర్ రమేష్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి సత్యవతి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ఆమె మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు.

“తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. ఈ విషయం నన్ను ఎంతో బాధించింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్‌కు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నాఉ. అలాగే నా సోదరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు. కాగా మెహర్‌ రమేష్‌, చిరంజీవి కుటుంబానికి చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది. వీరి కుటుంబాలు ఒకే దగ్గర ఉండేవి. అలా చిన్నప్పటి నుంచే వారికి మంచి పరిచయం ఉంది. ఈ రెండు కుటుంబాలు మధ్య కూడా మంచి సన్నిహిత్యం ఉంది. చిన్నప్పుడు మెహర్‌ రమేష్‌తో సరదాగా గడిపేవాడినని, ఆయన సోదరితో కూడా మంచి పరిచయం ఉందని ఓ సందర్భంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar